బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ‘డెకాయిట్’ హవా – 5వ రోజు భారీ వసూళ్లకు రెడీ

అడివి శేష్ హీరోగా షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా బుక్‌మైషోలో గత 24 గంటల్లో 53.37 వేలకు పైగా టికెట్లు అమ్ముడవటం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనం.
ఓవర్సీస్‌లో కూడా డెకాయిట్ తన సత్తా చాటుతోంది. కేవలం రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి, యూఎస్‌లోనూ మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నాన్-థియేట్రికల్ హక్కులు, పక్కా రిలీజ్ ప్లాన్‌తో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఇప్పటికే తమ పెట్టుబడిని రికవరీ చేసి లాభాల బాట పట్టారు. ఇక నేడు పబ్లిక్ హాలిడే కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో 5వ రోజు కలెక్షన్లలో భారీ వృద్ధి (సర్జ్) ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

Latest Articles