
అడివి శేష్ ‘డెకాయిట్’ ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ చిత్రానికి పెరుగుతున్న ఆదరణకు మరింత బలాన్ని చేకూరుస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘డెకాయిట్’ చూసిన తర్వాత సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. హరి పాత్రలో అడివి శేష్ అంకితభావంతో నటించిన తీరును ఆయన ప్రశంసించారు. శేష్ నటన గుర్తుండిపోయేలా ఉందని కొనియాడారు. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను, కథనానికి ఆమె అందించిన ఎమోషనల్ డెప్త్ ని కూడా చరణ్ అభినందించారు.
“#Dacoit చూశాను, చాలా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ అద్భుతమైన, గుర్తుండిపోయే నటనను కనబరిచారు. మృణాల్ చాలా అద్భుతంగా ఉన్నారు, తన పాత్రకు వన్నె తీసుకొచ్చారు. అనురాగ్ కశ్యప్ గారు, చిత్ర బృందం మొత్తం తమ బలమైన నటనతో ప్రత్యేకంగా నిలిచారు. #SupriyaYarlagadda గారు, @AnnapurnaStdios ఈ చిత్రానికి పూర్తి నమ్మకంతో మద్దతు ఇచ్చి, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దారు’ అని చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు రామ్ చరణ్.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా డెకాయిట్ టీంని ప్రశంసించారు. తన అభిప్రాయాలను పంచుకుంటూ, ఈ చిత్రంలో శేష్ చార్మింగ్‌గా, ఆకట్టుకునేలా, భావోద్వేగంగా కనిపించాడని వర్ణించారు. ప్రత్యేకంగా తన సోదరి జైన్ మేరీ ఖాన్‌ను అభినందించారు.
“‘డెకాయిట్’ చిత్ర బృందానికి అభినందనలు! శేష్ చార్మింగ్‌గా, ఆకట్టుకునేలా, భావోద్వేగంగా కనిపించారు. ఈ సినిమా టాక్సిక్ ట్రోప్స్ లేకుండా కొత్తగా అనిపించింది. మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారు. అతుల్ కులకర్ణి & ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగే పాత్రల్లో ఒదిగిపోయారు. నాకు టాప్ స్టార్ నా సోదరి @జైన్ మేరీ… బిగ్ స్క్రీన్ పై నిన్ను చూడటం చాలా గర్వంగా అనిపించింది.”అని ప్రశంసల కురిపించారు ఇమ్రాన్ ఖాన్.
రామ్ చరణ్ , ఇమ్రాన్ ఖాన్‌ల ప్రశంసలు, ‘డెకాయిట్’ చిత్రాన్ని బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే పాత్రలు, సాధారణ వినోదాత్మక చిత్రాలకు భిన్నంగా ఒక విభిన్నమైన, నటన, కథకు ప్రాధాన్యతనిచ్చే చిత్రంగా నిలబెట్టాయి.
ఓపెనింగ్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, వీక్ డేస్ లోనూ అదే బలమైన జోరును కొనసాగిస్తోంది. ఐదవ రోజున కూడా టికెట్ల అమ్మకాలు భారీ స్థాయిలో ఉండటంతో ఈ చిత్రం మరింత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.


