
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు బాలరాజు మాట్లాడుతూ – ఈ సినిమాకు ముందు నేను కొందరికే తెలుసు. ఈ సినిమా తర్వాత అందరి ఆదరణ పొందుతానని ఆశిస్తున్నాను. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
నటుడు సాయికృష్ణ మాట్లాడుతూ – నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే కొందరు సపోర్ట్ చేశారు, మరికొందరు నిరుత్సాహపరిచారు. కిరణ్ అన్న ఇచ్చిన ఈ మంచి అవకాశం నాకే కాదు నాలాంటి ఎంతోమందికి హోప్ ఇస్తోంది. అన్ని క్రాఫ్టుల వారిని కిరణ్ అన్న ఎంకరేజ్ చేయడం గొప్ప విషయం. అన్నారు.
నటుడు అనిల్ మాట్లాడుతూ – తిమ్మరాజు పల్లి టీవీ సినిమా మిమ్మల్ని టైమ్ ట్రావెల్ లోకి తీసుకెళ్తుంది. ఈనెల 17న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు
నటుడు లతీష్ మాట్లాడుతూ – మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పుడు ప్రీ రిలీజ్ దాకా మీ సపోర్ట్ అందిస్తున్నారు. ఈరోజు ఈవెంట్ లో ఫ్యామిలీ ఫంక్షన్ లా అందరూ ఎలా సందడిగా పాల్గొన్నారో మా మూవీ కూడా అలాగే సందడిగా ఉంటూ ఆకట్టుకుంటుంది.అన్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ విశాల్య మాట్లాడుతూ – నిన్నటితరంలోని సంప్రదాయాలు, ఆచారాలు, అప్పటి పరిస్థితులు ఇప్పుడున్న జెన్ జీ కిడ్స్ కు తెలియవు.వాళ్లంతా మా మూవీ ద్వారా అవన్నీ తెలుసుకుంటారు. ఈ సినిమా కాస్ట్యూమర్ గా పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు.
నటుడు తేజ విహాన్ మాట్లాడుతూ – నేను ఈ చిత్రంలో టీవీ కుమార్ అనే క్యారెక్టర్ లో నటించాను. ట్రైలర్ లో హీరో నన్ను కొన్నికేసెట్స్ అడుగుతాడు. అతనికి ఏం క్యాసెట్స్ ఇచ్చానో థియేటర్స్ లో చూడండి.ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో ఇలా కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్లు మరెవరూ ఉండరేమో.అన్నారు.
నటుడు సత్యనారాయణ మాట్లాడుతూ – మేమంతా ఈ సినిమాకు ఎంత కష్టపడి ప్యాషనేట్ గా వర్క్ చేశామో, కిరణ్ గారు కూడా అంతే గొప్పగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నెల 17న మా సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది, చాలా బాగుందనే టాక్ ప్రేక్షకులు, మీడియా మిత్రుల నుంచి వినిపిస్తుంది. అన్నారు
నటుడు టీవీ రామన్ మాట్లాడుతూ – తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి పనిచేశారు. నేను నటించిన చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వెళ్లాను. కానీ ఇలా వేదిక మీద మాట్లాడే అవకాశం కలగలేదు. ఈ చిత్రంతో ఆ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను నాగరాజు అనే పాత్రలో నటించాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుండే మంచి స్నేహితుడు నాగరాజు. మా డైరెక్టర్ మునిరాజు నా స్నేహితుడు.నా దృష్టిలో అతను నాగరాజు.అలాగే ఇంతమందికి కొత్త వాళ్లకు సపోర్ట్ గా నిలబడుతున్న కిరణ్ అన్న కూడా నాగరాజు లాంటి మంచి మనసున్న వాడే.అన్నారు.
నటుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ – నాకు నటనపై ఆసక్తి ఉన్నా అవకాశాల కోసం ప్రయత్నించలేదు. ఆర్మీలోకి వెళ్లి సర్వీస్ చేశాను. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కిరణ్ గారు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు ఇద్దరు సారథులు,ఒకరు కిరణ్ గారు, రెండో మా డైరెక్టర్ మునిరాజు గారు. అన్నారు.
నటి మాధవి మాట్లాడుతూ- ఈ సినిమాకు చివరి నిమిషంలో ఎంపికయ్యాను. వసంత అనే క్యారెక్టర్ చేశాను. సమ్మర్ వస్తుంది కదా,సమ్మర్ క్యాంప్ లాంటి సినిమా ఇది. మీరంతా థియేటర్స్ లో మా మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ- కొత్త వాళ్లతో చిన్న సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. కిరణ్ గారెకి అలాంటి ధైర్యం ఉంది. ఆయన ఈ సినిమా గురించి నాకు చెప్పారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అమేజింగ్ టాలెంట్ ప్రదర్శించారు.అన్నారు.
లిరిసిస్ట్ సనరే మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను రాసిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గోపాల పాట కూడా హిట్ అయ్యింది. నాపై నమ్మకం ఉంచి ఇలాంటి మంచి సాంగ్స్ రాసే అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. అన్నారు.
డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి మాట్లాడుతూ – మా మూవీలో ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి పనిచేశారో ఈ నెల 17న స్క్రీన్స్ మీద చూస్తారు. కుప్పంలోని బ్యూటిపుల్ లొకేషన్స్ ను మా మూవీలో ఆకట్టుకునేలా చిత్రీకరించాం. కిరణ్ అన్న ఈ మూవీకి కంప్లీట్ సపోర్ట్ అందించారు. అన్నారు.
నటుడు అమ్మ రమేశ్ మాట్లాడుతూ – కిరణ్ అబ్బవరం గారిని చూస్తే పవన్ కల్యాణ్ గారి అన్నవరం సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో చెల్లి కోసం అన్న అండగా నిలబడతాడు. కిరణ్ గారు తన నిలబడిన సినిమా ఇండస్ట్రీలో ఎందరో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ- ఈ సినిమా ఫైనల్ ప్రాడక్ట్ చూసినప్పుడు ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా అనిపించింది. మా సినిమా టీమ్ అంతా ఏడాది పాటు కష్టపడి ఈ ఔట్ పుట్ తీసుకొచ్చారు. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ.అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – కేఏ ప్రొడక్షన్స్ లో సినిమా అంటే మీరు ధైర్యంగా థియేటర్స్ కు వెళ్లొచ్చు. ఆ హామీ మేమంతా ఇస్తున్నాం. మేము చేసే ఏ మూవీకైనా చాలా వర్క్ చేస్తాం. అందుకే ఇలాంటి మంచి ఔట్ పుట్ వచ్చింది. మా సినిమా ఎలా ఉండబోతుందో మీకు ముందే చెప్పేస్తున్నాం. మీకు నచ్చితే థియేటర్స్ కు వచ్చి సపోర్ట్ చేయండి.అన్నారు.
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ చౌహాన్ మాట్లాడుతూ – తను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పడిన కష్టం కొత్త వాళ్లు పడకూడదు, కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తానని కిరణ్ అన్న చాలా కాలం క్రితమే చెప్పారు. ఆయన చెప్పినట్లే కేఏ ప్రొడక్షన్స్ లో న్యూటాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుండటం అభినందనీయం.అన్నారు.
నటి స్వాతి మాట్లాడుతూ- మా మూవీ ట్రైలర్ ఎంత బాగుంటుందో,సినిమా కూడా అంతే బాగుంటుంది. నేను మంచి అవకాశం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ వచ్చాను.ఈ ఏడాది తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో ఆ అవకాశం దక్కింది. అన్నారు.
నటి రాజశ్రీ మాట్లాడుతూ – ఈ మూవీ కోసం మేమంతా ఎంతో ప్యాషన్, డెడికేషన్ తో కష్టపడి పనిచేసాం. ఈ నెల 17న థియేటర్స్ కు వచ్చి మా మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు ప్రదీప్ మాట్లాడుతూ – ఈ సినిమాలో చిన్న సీన్ లో కనిపించినా చాలు అనుకుని ఆడిషన్ కు వెళ్లాను. డైరెక్టర్ గారు ఇంత ఇంపార్టెంట్ రోల్ ఇస్తారని ఊహించలేదు. ట్రైలర్, సాంగ్స్ మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో, సినిమా అంతకుమించి ఎంగేజ్ చేస్తుంది.అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు,చెల్లికి ఏమీ కొనివ్వలేదు.ఈ నెల 17న తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయ్యాక మీరంతా గర్వపడేలా చేస్తాను.మనకు ఎంత ప్రతిభ ఉన్నా, అవకాశం ఇచ్చేవాళ్లే గొప్ప. మీటర్ సినిమా టైమ్ లో కిరణ్ గారిని కలిశాను. ఆయన ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్ గా ప్రమోట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నాను. కేఏ ప్రొడక్షన్స్ నాకు ఫ్యామిలీ లాంటిది. ఈ సంస్థను వదులుకోను. రహస్యగారు మమ్మల్మి తల్లిలా చూసుకుంటారు. ఈ నెల 17న మా సినిమా చూడండి. గ్యారెంటీగా మీకు నచ్చుతుంది. సక్సెస్ మీట్ లో తప్పకుండా కలుద్దాం.అన్నారు.
కేఏ ప్రొడక్షన్స్ సీయీవో రహస్య కిరణ్ మాట్లాడుతూ- నేను సిటీలో పెరిగాను. నాకు ఊరి వాతావరణం తెలియదు. కిరణ్ విలేజ్ నుంచి వచ్చాడు. ఆయన నా లైఫ్ లోకి రావడం వల్ల ఆ విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగాను. ఈ తరం జెన్ జీ కిడ్స్ కు అప్పటి విలేజ్ ట్రెడిషన్స్, ఆ వాతావరణం తెలియదు. మా మూవీ చూస్తే మీరంతా ఆ టైమ్ కల్చర్ ను ఎంజాయ్ చేస్తారు. ఈనెల 17న మీరంతా సినిమా చూస్తుంటే, నేను ఈ కొత్త వాళ్ల మొహాల్లో సంతోషం చూస్తాను. వాళ్లకు సక్సెస్ దక్కితే కేఏ ప్రొడక్షన్స్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నం విజయవంతమైనట్లే. కిరణ్ నాకు లైఫ్ లో పెద్ద సపోర్ట్ . నేను జీవితంలో ఎంతో ఎదగాలని సపోర్ట్ చేస్తుంటారు. ఇలాంటి పార్టనర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి. మా చిన్న టీవీ పెద్ద స్క్రీన్స్ లోకి వస్తోంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – ఆన్ లైన్ ఎడిటింగ్ చేసే నాకు హీరోగా అవకాశం ఇచ్చారు కిరణ్ గారు. అలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను హీరోగా వద్దని ఎవరెన్ని చెప్పినా మా రహస్య గారు నువ్వే హీరో అని చెప్పేవారు. ఆమె ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. నాకు సోదరి ఉంటే రహస్య గారిలా ఉండేదేమో. డైరెక్టర్ మునిరాజు అన్నకు కూడా థ్యాంక్స్ చెబుతున్నా. నేను హీరో అనే కంటే కిరణ్ అబ్బవరం తమ్ముడు అని ఎవరైనా పిలిస్తేనే సంతోషంగా ఉంటుంది. ఇంతమందికి అవకాశం కల్పించాలని కిరణ్ గారు మంచి మనసుతో చేసిన ప్రయత్నాన్ని సక్సెస్ చేసేందుకు మీరంతా ఈ నెల 17న థియేటర్స్ కు వెళ్లి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూడండి.అన్నారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ – నాతో పాటు మరో 60 మంది కొత్త వాళ్లకు ఈ సినిమా అవకాశం కల్పించింది. అలా మొదటి మెట్టు ఎక్కే అవకాశం మా కిరణ్ గారు కల్పించారు. ఒక అవకాశం కోసం వెయిట్ చేసేవారికి ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేను. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన కిరణ్ గారికి మాత్రమే మాలాంటి వారి ఎమోషన్ అర్థమవుతుంది. ఒక అమ్మాయిగా చెబుతున్నా కేఏ ప్రొడక్షన్స్ పక్కా ప్రొఫెషనల్ బ్యానర్. మా రహస్య గారు సినిమా బాగా రావాలని ఎంతో ప్యాషనేట్ గా ఉంటారు. డైరెక్టర్ మునిగారు త్వరలో ఒక మంచి పొజిషన్ కు వెళ్తారు. సాయితేజ్ లాంటి కోస్టార్ తో నటించడం హ్యాపీగా ఉంది. ఈతరం ప్రేక్షకులు తప్పకుండా మా మూవీ చూడాలి.మా సినిమాలో ఫారిన్ సాంగ్స్ లేవు, భారీ యాక్షన్ సీక్వెన్సులు లేవు కానీ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీతో పాటే మా మూవీ వస్తుంది. మీ అందరికీ అందమైన జ్ఞాపకంలా మా సినిమా మిగిలిపోతుంది. అన్నారు.
నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా అమ్మానాన్న, అన్నయ్య ఆశీస్సుల వల్లే ఈ వేదిక మీద ఉండగలిగాను. నేను చేసే ప్రయత్నాలకు మీరంతా సపోర్ట్ గా నిలుస్తున్నారు. మా ముని గురించి, హీరోహీరోయిన్స్ ఇతర టీమ్ అందరి గురించి ఈ నెల 17వ తేదీ తర్వాత మాట్లాడుతా. వాళ్లంతా అద్భుతమైన వర్క్ చేశారు. చిన్న చిత్రాల్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. ఒక చిన్న బడ్జెట్ లో టెక్నికల్ గా ఇంత క్వాలిటీగా, ఇంత బ్రిలియంట్ గా మూవీ చేయోచ్చా అని ఆశ్చర్యపోతారు. సోదరుడు వంశీకాంత్ మా మూవీకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ కోసం థియేటర్స్ కు వెళ్లేవాళ్లను మా సినిమాలోని సౌండింగ్ రెండు రోజులు హాంట్ చేస్తుంది. నేను వీళ్లకు అవకాశం ఇచ్చానని, సినిమా చేశానని అందరితో అనిపించుకోవడం కంటే ఒక జెన్యూన్ సినిమా చేశామనే గుర్తింపు పొందడమే నాకు సంతోషాన్నిస్తుంది. తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగిన ఘటనల నేపథ్యంగా ఇంత థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా సినిమా రూపొందించవచ్చా అని మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది. ఇండస్ట్రీలోని వారిని నా సినిమాలకు సపోర్ట్ చేయమని ఎప్పుడూ అడగలేదు.కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేయమని కోరుతున్నా.ఎందుకంటే కనీసం యాభై కుటుంబాల ఆశలు ఈ సినిమా మీద ఉన్నాయి. నాకు వీలైనంత సపోర్ట్ వారికి నేను చేశాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే కొత్తవాళ్లకు మరింత హోప్స్ ఇచ్చినట్లు ఉంటుంది. మీడియా మిత్రులు కూడా మా సినిమాకు సహకారం అందించాలని కోరుతున్నా. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బులు రావాలి, నా పెట్టుబడి రాకున్నా ఫర్వాలేదు. ఈ కొత్త వాళ్ల లైఫ్స్ సెట్ కావాలి. నేను కోరుకునేది అదే. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్పగా భావించడం లేదు. మనం చేయాల్సిన బాధ్యతగా ఫీలవుతున్నా. ఊర్లల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కలలుకనే వారికి చెబుతున్నా మీరు ధైర్యంగా అనుకోండి ఏది అనుకుంటే అది అవుతారు. ఎవరూ నిరుత్సాహపడకండి. నాకు ఏ గుర్తింపు లేనప్పటి నుంచే నన్ను నమ్మింది రహస్య. నా సక్సెస్ కు ఆమె కారణం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఫేర్ వెల్ ఫీలింగ్ కలుగుతోంది. మా చిన్న చిత్రానికి ఇండియాలో పెద్ద స్క్రీన్ మీద ప్రీమియర్ వేస్తున్నాం.మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులే మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను సపోర్ట్ చేయాలి. మా సినిమాను తమిళ, మలయాళం వాళ్లు రిలీజ్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ తో సినిమాకు వెళ్లండి. మంచి సమ్మర్ వెకేషన్ కు వెళ్లినట్లు ఉంటుంది.సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఇది నా ప్రామిస్. అన్నారు.
నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ డిజైనర్ – విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు


