
జీ5 ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. అదే ‘‘మేము‘కాప్’లం’’. కొన్నాళ్ల నుంచి ఈ సిరీస్ టైటిల్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచేలా ‘‘మేము‘కాప్’లం’’ ట్రైలర్‌ను విడుదల చేశారు..
ట్రైలర్‌ను గమనిస్తే.. మహదేవపట్నం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అయ్యగారు వారసుడొచ్చాడండోయ్.. అని పాలేరు అని అరిచి మరి చెబుతాడు. అప్పుడు గజపతిరాజు పాత్రలో నటించిన నాగబాబు ఆనందపడతాడు. సలార్‌రాజు తన వారసుడు అని ప్రకటిస్తాడు. అయితే అనుకోకుండా ఆ సలార్ రాజు కనిపించకుండా పోతాడు. దీంతో ఊరంతా గందరగోళంలో పడుతుంది. ఇంతకీ సలార్ రాజు ఎవరో కాదు.. కోళ్ల పందెల్లో పాల్గొనాల్సిన కోడిపుంజు. దీన్ని వెతకటానికి ఇద్దరు పోలీసులు(గెటప్ శీను, రవితేజ నన్నిమల) ఊళ్లోకి వస్తారు.
సలార్ రాజు కనిపించకపోవటం వల్ల..ఎవరికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషిస్తుంటారు. అయితే వారికి ఊళ్లో మరో సమస్య కనిపిస్తుంది. దీంతో వాళ్లు కొత్త సమస్య నుంచి ఊరిని బయటపడేయటానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ మహదేవపట్నంలోని ప్రధాన సమస్య ఏంటి? పోలీసులు దాన్ని ఎలా పరిష్కరిస్తారు. అసలు ఇంతకీ సలార్ రాజు దొరికాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మే 22న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘‘మేము‘కాప్’లం’’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి రూపొందింది. ‘వికటకవి’ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కీలక పాత్రల్లో నటించారు. కామెడీ, మిస్టరీ కలయికగా అందరినీ ఆకట్టుకునే కథాంశంతో..గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం..ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.
కోడి పందేలనే పిచ్చిలో మునిగిపోయిన గ్రామంలో ఊరిలో డబ్బున్నవారందరూ పోటీ పడుతుంటారు. వారిలో ఒక వ్యక్తికి సంబంధించిన పందెం కోడి ఆకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో గ్రామంలో ఓ గందరగోళం మొదలవుతుంది. ఆ కేసు విచారణ బాధ్యతను పోలీసు అధికారులు ఇద్దరు అమాయక పోలీసులైన రవి, మోహన్ సోటారిలకు అప్పగిస్తారు. కోడి కోసం అన్వేషణ సాధారణంగా మొదలవుతుంది. అయితే అనుకోని ఘటనతో కేసు ఓ పెద్ద మిస్టరీగా మారిపోతుంది. విచారణలో వారు చేసే తప్పులు, ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. కానీ ఆ గందరగోళంలోనే వారు అనుకోకుండా గ్రామపు మూలాలను కదిలించే ఒక పెద్ద రహస్యానికి దగ్గరవుతారు.
“Memu COPlam” Trailer ▶️
https://youtu.be/WO0bg33MpsU
లోకల్ ఫ్లేవర్‌తోబలమైన, వ్యంగ్యమైన పాత్రల చుట్టూ తిరిగే కథనం, కథా పాత్రలతో “మేము కాప్’లం” తెలుగు ZEE5 ఒరిజినల్స్‌లో మరోసారి ప్రేక్షకులను మెప్పించే వెబ్ సిరీస్‌గా అలరించనుంది. మనం ఎప్పుడూ చూసే, మనల్ని ప్రతిబింబించే కథలను ఆధునిక మేళవింపుతో చూపించే జీ5 ప్రాజెక్ట్‌ల జాబితాలో ఇది ఒకటిగా మెప్పించనుంది.
‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్ అప్ డేట్స్ కోసం జీ5ను ట్యూన్ చేయండి.
నటీనటులు:
గజపతిరాజు పాత్రలో నాగేంద్రబాబు
మోహన్ సోటారి పాత్రలో గెటప్ శీను
రవి సోటారి పాత్రలో రవితేజ నన్నిమల
మీనాక్షి పాత్రలో రీతూ చౌదరి
ఆకాష్ రెడ్డి పాత్రలో చరణ్ లక్కరాజు
సంఘవి పాత్రలో సిరి పార్వతి
గిరి పాత్రలో కిరిటీ దామరాజు
సాంకేతిక వర్గం:
నిర్మాత: బి.వి.ఎస్.రవి
నిర్మాణ సంస్థ: రా ఎంటర్‌టైన్మెంట్స్
డైరెక్టర్: ప్రదీప్ మద్దాలి
కథ: శోభన్ చిట్టిప్రోలు
స్క్రీన్ ప్లే: శోభన్ చిట్టిప్రోలు, చాణక్య వర్మ, గోపాలకృష్ణ విద్మహే
మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ కోమందూరి
ఎడిటర్: మైకేల్ డి’సెల్వా
సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిడపు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: గోపాలకృష్ణ విద్మహే
ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్: రాజ్ కుమార్ కోసన
పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (ఎస్.కె.నాయుడు- ఫణి కందుకూరి)


