‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి రచయితగా, దర్శక నిర్మాతగా రూపొందించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఫస్ట్ టైం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ సినిమాల్లోనే భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం కాగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో కనిపించారు. హీరోయిన్‌గా అనిక్క విక్రమన్ నటించగా, మైమ్ గోపి, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకట్ సంగీతం అందించగా, వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

కథ:

2304 AD నేపథ్యంలో ప్రారంభమయ్యే ఈ సినిమా, కలియుగం అంతానికి దారితీసిన సంఘటనలు మరియు అనంతరం ఏర్పడిన కొత్త ప్రపంచ నిర్మాణం చుట్టూ తిరుగుతుంది. ఏలియన్స్‌కు గతంలో మానవజాతిలో జరిగిన పరిణామాలను వివరిస్తూ, ఒక పవిత్ర మహిళ కొత్త సృష్టికి ఎలా కారణమైందనే ఆసక్తికర అంశాన్ని కథలో చూపించారు.

హీరోయిన్ అనిక్క విక్రమన్‌ను వివాహం చేసుకోవాలని ఆమె బావ భూపాల్ రాజు ప్రయత్నిస్తుండగా, మరోవైపు శివకుమార్ రామచంద్రవరపు మరియు అఖిల్ సార్థక్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెను వెంటాడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అనిక్క ఎలా బయటపడింది? సౌరబ్ ధింగ్రతో ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? కొత్త భారత ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఫస్ట్ టైం’.

నటీనటుల ప్రదర్శన:

డెబ్యూ హీరో అయినప్పటికీ సౌరబ్ ధింగ్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. అనిక్క విక్రమన్ అందం, అభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అఖిల్ సార్థక్, భూపాల్ రాజు, శివకుమార్ రామచంద్రవరపు తమ పాత్రలకు న్యాయం చేశారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ పాత్రలు కథకు బలాన్ని చేకూర్చాయి.

సాంకేతిక విభాగం:

AI టెక్నాలజీకి బదులుగా పూర్తి స్థాయిలో Human Intelligence‌తో తెరకెక్కించిన ఈ చిత్రం దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి విజన్‌ను ప్రతిబింబిస్తుంది. తక్కువ బడ్జెట్‌లోనే అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ విజువల్స్ అందించడం విశేషం. ముఖ్యంగా VFX వర్క్ మరియు విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా కథకు పెద్ద ప్లస్ అయింది. శ్రీ వెంకట్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది.

ప్లస్ పాయింట్స్:

  • గ్రాండ్ విజువల్స్ & VFX
  • నటీనటుల ప్రదర్శన
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
  • సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్:

  • ఫస్టాఫ్‌లో కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలు

సారాంశం :
సనాతన ధర్మపు ఉనికిని కాపాడుతూ ప్రపంచ ఎదుగుదలను అలాగే ప్రపంచానికి రానున్న ముప్పులను చూపిస్తూ ఈ వేసవిలో ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఫస్ట్ టైం.

Related Articles

Latest Articles