‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ లాంచ్

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది

అనౌన్స్‌మెంట్ వీడియో, ప్రోమోతో అంచనాలు పెంచిన మేకర్స్, తాజాగా ఫస్ట్ సింగిల్‌  హాయ్ రే ను విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో, క్యాచీ ట్యూన్‌తో ఆకట్టుకుంటోంది. ఎస్. థమన్ ఈ పాటను స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్, హిప్‌హాప్ బీట్స్‌తో ఫాస్ట్ పేస్డ్ రిథమ్ నంబర్‌గా కంపోజ్ చేశారు. ట్రెండీ రిథమ్స్‌తో పాటు క్లాసికల్ టచ్, బ్రైట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ పాటకు మోడ్రన్ & సోల్‌ఫుల్ ఫీల్ తీసుకొచ్చాయి.

అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాఫ్ట్ ఎమోషన్స్ నుంచి హై ఎనర్జీ హుక్స్ వరకు ఆయన వాయిస్ పాట మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. సంజన ఆలపించిన కర్ణాటిక్ టచ్ నోట్స్, హర్ష వర్ధన్ ర్యాప్ సెగ్మెంట్ పాటకు కొత్త లేయర్స్‌ను జోడించాయి. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం సింపుల్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఉండి హీరోయిన్‌ను దూరం నుంచి ప్రేమించే హీరో భావాలను అందంగా వ్యక్తపరిచింది.

ప్రోమోలో ఛాలెంజింగ్ పాత్రతో ఆకట్టుకున్న అనీష్, ‘హాయ్ రే’ పాటలో మరో కొత్త కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా డ్యాన్స్‌లో తన నేచురల్ ఫ్లో, క్లీన్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హిప్‌హాప్ స్టైల్‌లో ఆయన చేసిన డ్యాన్స్ విజువల్‌గా ఫ్రెష్ ఫీల్ ఇస్తోంది. అనస్వర రాజన్ తన ఎలిగెన్స్‌తో పాట మూడ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

థమన్ ఎనర్జిటిక్ కంపోజిషన్, అనిరుధ్ మ్యాజికల్ వాయిస్, అనీష్ స్టైలిష్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కలిసి ‘హాయ్ రే’ను ఇన్‌స్టంట్ లైకబుల్ ఫస్ట్ సింగిల్‌గా నిలబెట్టాయి. యూత్‌ఫుల్, ఎమోషనల్, అడిక్టివ్ ఫీల్‌తో ఈ పాట మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ఇట్లు అర్జున’కు ‘హాయ్ రే’ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Related Articles

Latest Articles