
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ‘రాకా’ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఒకేసారి 37 మంది నటులపై ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’ నిర్వహించి ఈ ఘనత సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా గిన్నిస్ ప్రతినిధుల నుంచి అల్లు అర్జున్, అట్లీ సర్టిఫికెట్ను అందుకున్న ఫొటోను పంచుకున్నారు.


