“దీవాన” చిత్ర రివ్యూ

వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలుగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమెగలై జంటగా నటిస్తూ నేను ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దీవాన. ఈశ్వర్ చంద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ చేయగా హృషికేష్ పాస్పల్ ఎడిటింగ్ చేశారు. వికె నరేష్, ఝాన్సీ, జీవన్, వేణు తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో సాధారణంగా కనిపించే ఒక మధ్య తరగతి మనుషుల కథగా చెప్పుకోవచ్చు. సరదాగా బాధ్యత తెలియకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండే ఒక యువకుడు తన ఏరియాలో ఉండే మీసేవలో పని చేసే ఒక యువతిని ప్రేమిస్తాడు. కాని అతనికి ఒక ఆదాయం లేకపోవడంతో గవర్నమెంట్ జాబ్ రావాలి అనే షరతు పెడుతుంది. ఈ క్రమంలో అదే ఏరియాలో మరొక గ్యాంగ్ తో ఈ యువకుని గ్యాంగ్ తో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. దీని వల్ల అతనికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా? తన కుటుంబంతో అతనికి వచ్చిన ఛాలెంజ్ ఏంటి? అతని స్నేహితులు అతనికి ఎంత వరకు అండగా నిలుస్తారు? ఆ అమ్మాయికి ఆ యువకుడిని ప్రేమించేందుకు వచ్చిన అడ్డు ఏంటి? చివరికి వారు కలుస్తారా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిత్రంలో తన పాత్ర బయట కనిపించే సాధారణ యువకుని వలే ఉంటుంది. దాని వల్ల సహజ నటనను తనదైన్ శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. పక్క హైదరాబాదీ యువకుడిని పోలుస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ గా నటించిన స్మేహ ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ తో చాలా బాగా నటించారు. ఎమోషన్స్ బాగా పండించారు, ప్రతి ఎమోషన్ బాగా చూపించారు. యువకుని తల్లితండ్రుల పాత్రలలో ఝాన్సీ, నరేష్ గారు ఒక మధ్య తరగతి కుటుంబ సభ్యుల పాత్రలలో అద్భుతంగా నటించారు. వారి మధ్య ఎమోషన్స్ కళ్ళకి కట్టినట్లు చూపించారు. జీవన్, వేణు పాత్రలు తక్కువగా కనిపించినప్పటికీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్రలు. అలాగే హీరో స్నేహితులు, హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర తమ పరిధిలో ఉంటూనే చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారి పాత్రలు సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. అలాగే సినిమాలో నటించిన ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
ఇప్పటికే మధ్య తరగతి మనుషుల మధ్య యువకుల ప్రేమ కథలు ఎన్నో చూసినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే అంత గొప్పగా కథను దర్శకత్వం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సినిమాటోగ్రఫీ అలాగే చిన్న గల్లీలలో కూడా లొకేషన్స్ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్త పడి చాలా బాగా చేశారు. బిజిఎం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ చిత్రానికి పాటలు అతి పెద్ద బోనస్ గా నిలిచాయి. కలరింగ్, ఇతర సాంకేతిక విషయాలు బావున్నాయి. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా ఉన్నప్పటికీ సినిమాలోని ప్రేమ కథలో ప్రేక్షకులు మునిగిపోవడం వల్ల బోర్ కొట్టదు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటులు నటన, పాటలు.

మైనస్ పాయింట్స్ :
బిజిఎం, కొన్ని సన్నివేశాలు.

సారాంశం :
మధ్య తరగతి కుటుంబ అనుబంధాలను తెలుపుతూ ప్రేమకోసం ఎంత దూరమైన వెళ్ళే ఒక యువకుని ప్రేమ కథ “దీవాన”.

Related Articles

Latest Articles