శ్రీవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ కుమారుడు

తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు మోక్షజ్ఞ ను వేద మంత్రాలతో ఆశీర్వదించగా టిటిడి అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అయితే త్వరలో మోక్షజ్ఞ వెండితెరపై ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles