డిసెంబర్ 11న విడుదల కానున్న ‘భూతం ప్రేతం’

సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి. వెంకటేశ్వర రావు నిర్మించిన కొత్త చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీపావళి సందర్భంగా వదిలిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 11న ఈ చిత్రం విడుదల కాబోతోన్నట్టుగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ని గమనిస్తుంటే.. ఈ చిత్రంలో కామెడీతో పాటుగా కావాల్సిన హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతోంది. పోస్టర్‌లో ఒక్కొక్కొరు ఒక్కో ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తున్నారు. ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాలు చిత్రంలో ఉన్నాయని టీం హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఈ మూవీ నుంచి మున్ముందు మరిన్ని అప్డేట్‌లు రానున్నాయి. వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు టీం సన్నద్దం అవుతోంది.

నటీనటులు : యాదమ్మ రాజు, గల్లీ బాయ్ భాస్కర్, బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు తదితరులు.

సాంకేతిక బృందం:

నిర్మాత: బి. వెంకటేశ్వరరావు
బ్యానర్: సృజన ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: రాజేష్ ధృవ
సహ రచన, సంభాషణలు: షంషీర్
ప్రొడక్షన్ డిజైన్, సహ దర్శకత్వం: రాధిక అచ్యుత్ రావు
సహాయ దర్శకుడు: సతీష్ ఎస్. అరలేశ్వర్
ఛాయాగ్రహణం: యోగేష్ గౌడ
ఎడిటింగ్: ఉజ్వల్ చంద్ర
సంగీతం, నేపథ్య సంగీతం: గిరీష్ హోతూర్
వీఎఫ్ఎక్స్: స్వరూప్ భట్
సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ మిక్సింగ్: రవి హిరేమఠ్
కళా దర్శకత్వం: దేవి ప్రకాష్ శెట్టి
పీఆర్వో: సాయి సతీష్

Related Articles

Latest Articles