
ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందిన చిత్రం ‘మొహబ్బత్’. అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మ్యూజికల్ ప్రమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకునేందకు టీం రెడీ అయింది. అందుకే పాటలతో శ్రోతల్ని ఆకట్టుకునేందుకు ముందుగా ఓ అందమైన ప్రేమ గీతాన్ని వదిలారు. డైరక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా ‘వరమే’ అనే ఈ పాటను రిలీజ్ చేశారు.
‘వరమే’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని కృష్ణ తేజస్వి ఆలపించగా.. భాష్య శ్రీ ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. సునీల్ కశ్యప్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. యూత్ ఆడియెన్స్‌కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంది. లిరికల్ వీడియోలో మొయిన్ కంపోజ్ చేసిన తీరు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. సింపుల్ స్టెప్స్‌తో కథని నడిపిస్తూ ఎంతో అందంగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ ‘వరమే’ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సలీమ్ షేక్, సినిమాటోగ్రఫర్‌గా వైఎస్ కృష్ణ, రచయితగా కలాం, సంగీత దర్శకుడిగా సునీల్ కశ్యప్, ఎడిటర్‌గా శ్రీ వర ప్రసాద్ వర్క్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
నటీనటులు : సంతోష్ రాజా, ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ తదితరులు
టెక్నికల్ టీం
బ్యానర్ : ఏబీఎస్ ప్రొడక్షన్స్
నిర్మాత : అఫ్రోజ్ షేక్
దర్శకుడు : మ్యాక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సలీం షేక్
సంగీతం : సునీల్ కశ్యప్
కెమెరా : వైఎస్ కృష్ణ
ఎడిటింగ్ : శ్రీ వర ప్రసాద్
పీఆర్వో : ఏలూరు శ్రీను, మాడూరి మధు


