“శంబాల” చిత్రా రివ్యూ

వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల : ఎ మిస్టిక్ వరల్డ్’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా మధు నందన్, రవి వర్మ, లక్ష్మణ్, షిజు, హర్షవర్ధన్, శైలజ ప్రియా తదితరులు కీలకపాత్రను పోషించారు. క్రిస్మస్ సందర్భంగా నేడు విడుదలైన ఈ చిత్ర విషయానికి వస్తే…

కథ :
1980 నాటి సమయంలో ఒక మారుమూల గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉలక పడుతుంది. సైన్స్, మూఢనమ్మకాలు మధ్య ఉన్న కాలమది.అయితే ఆ ఉలకపడిన వెంటనే ఆ గ్రామంలో అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పులను చూసి ఆ గ్రామస్తులంతా ఎంతో భయాందోళనకు చెందుతారు. అదే గ్రామానికి ఒక సైంటిస్ట్ వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అయితే పడినప్పుడు ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎటువంటివి? ఆ మార్పులు వల్ల గ్రామంలో ఎటువంటి సంఘటనలు చోటు చేస్తుంటాయి? సైంటిస్ట్ ఆ గ్రామంలో పరిస్థితులు చక్క పెడతారా లేదా వారితో పాటు సర్దుకుపోతారా? ఆ ఉలకకు, గ్రామానికి, పురాణాలకు ఉన్న సంబంధం ఏంటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఆది సాయికుమార్ పాత్ర సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికి ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలు చేసిన ఆది 1980ల నాటి ఈ సినిమాలో అప్పటి రెట్రో లుక్ తో చాలా అందంగా కనిపించారు. అంతేకాక ఒక సైంటిస్ట్ పాత్రలో అటు ప్రశ్నలకు సమాధానం వెతికే సైడ్ నుండి ఇటు ప్రజలకు హాని జరగకూడదని పోరాడే వీరుడిలా ప్రతి సీన్ లోను తనదైన శైలిలో అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. అర్చన అయ్యర్ పాత్ర వెండి తెరపై కనిపించేది తక్కువగా ఉన్నప్పటికీ కథకు తన పాత్ర ఎంతో ప్రముఖమైనది. ఆమె పెర్ఫార్మన్స్ రెండు విధాలుగా కూడా ఎంతో అద్భుతంగా అనిపించింది. అలాగే చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన మధుసూదన్, రవి వర్మ, లక్ష్మణ్ తదితరుల పాత్రలు ఎంతో ప్రముఖమైనవి. ఎవరి పాత్రకు తగ్గ ప్రాముఖ్యత వాడికి ఉండటం, అలాగే అది సినిమాకు మరింత బలం కావడం విశేషం. చిత్రంలో కనిపించిన ఇతర పాత్రలు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బోనస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
కథను వెండి ధరపై తీసుకెళ్లడంలో దర్శకుడు యుగంధర్ ముని సక్సెస్ అయినప్పటికీ సినిమా కాస్త స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే అలా స్లోగా ఉండటం వల్ల ప్రతి విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ గా చెప్పుకోవాలి. విఎఫ్ఎక్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ నటీనటుల పర్ఫార్మెన్స్ వల్ల అవన్నీ ప్రేక్షకులు అంతగా పట్టించుకోకపోవచ్చు. లొకేషన్స్, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటులు నటన.

మైనస్ పాయింట్స్ :
విఎఫ్ఎక్స్, కథ స్లోగా ఉండటం.

సారాంశం :
మిస్టీరియర్స్ థ్రిల్లర్స్ వీక్షించే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్. పురాణాలకు, మనుషుల ప్రవర్తనకు ముడివేస్తూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం శంబాల.

Related Articles

Latest Articles