
వేసవి సెలవులు అనేది ప్రతీ ఒక్కరికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బాల్యంలో గడిపిన వేసవి సెలవులు, స్నేహితులతో ఆడుకోవడం, అమ్మమ్మ, తాతయ్యలతో గడపడం, సొంత ఊరికి వెళ్లడం అనేవి ఎప్పటికీ తీపి గుర్తులుగానే ఉంటాయి. అలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించేలా ‘సమ్మర్ హాలీడేస్’ అనే చిత్రం రీసెంట్గా వచ్చింది. థియేటర్లో ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 4 నుంచి ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
శ్రీకర్ నయన్ తన తొలి చిత్రంతోనే దర్శకుడిగా సత్తా చాటుకున్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాతో అందరినీ బాల్యంలోకి తీసుకు వెళ్లారు. గోదావరి ప్రాంతంలోని ఒక సుందరమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) అనే బాలుడు తన వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్లడంతో ఈ చిత్రం మొదలవుతుంది. అక్కడ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కె.వి (రోహన్ రాయ్) అనే బాలుడితో మైత్రి మొదలవుతుంది. రెండు విభిన్న ప్రపంచాల నుండి వచ్చినప్పటికీ ఆ అబ్బాయిల మధ్య ఊహించని స్నేహం ఏర్పడుతుంది. ఒక సాధారణ వేసవి సెలవుగా ప్రారంభమైన వారి ప్రయాణం తరగతి గది పరిధిని దాటిన అన్వేషణ, నవ్వులు, సాహసం, జీవిత పాఠాలతో కూడిన ఒక అసాధారణ ప్రయాణంగా మారుతుంది.
బాల్యపు అమాయకత్వాన్ని చాటేలా ఈ చిత్రం ఉంటుంది. మానవ సంబంధాలలోని ఆత్మీయతను, స్నేహంలోని సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సినిమాని తెరకెక్కించారు. జీవితంలోని అత్యంత విలువైన జ్ఞాపకాలు అత్యంత సాధారణ క్షణాల నుండే పుడతాయని ఈ చిత్రం సున్నితంగా గుర్తు చేస్తుంది.
దర్శకుడు శ్రీకర్ నాయన్ మాట్లాడుతూ .. ‘’సమ్మర్ హాలిడేస్’ అనేది బాల్యం, స్నేహం విలువను చాటి చెప్పేలా ఉంటుంది. దర్శకుడిగా నా తొలి చిత్రం కావడంతో ‘సమ్మర్ హాలీడేస్’ నాకెప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. సోనీ లివ్‌లో డిజిటల్ ప్రీమియర్‌తో ఈ చిత్రం విస్తృత ప్రేక్షకులకు చేరుతుందని ఆశిస్తున్నాను. కుటుంబమంతా కలిసి ఈ చిత్రాన్ని చూసి తమ బాల్యపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని కోరుకుంటున్నారు. జీవితంలోని చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనడంలో ఉన్న సౌందర్యాన్ని తిరిగి తెలుసుకునే అవకాశాన్ని ఈ చిత్రం కల్పిస్తుందని సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
జయ సుధ మాట్లాడుతూ .. ‘పిల్లలతో పనిచేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అదొక ఉల్లాసకరమైన అనుభవం అని చెప్పుకోవచ్చు. వారి అమాయకత్వం, సహజత్వం ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రాన్ని నాకు మరింత ప్రత్యేకంగా చేశాయి. ఈ చిత్రం తరాల మధ్య బంధాన్ని, ఆనందాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండటంతో కుటుంబాలను ఒకచోట చేర్చుతుందనే నమ్మకం నాకుంది. వేసవి సెలవుల్లో సృష్టించుకున్న అద్భుతమైన జ్ఞాపకాలను ఈ చిత్రం అందరికీ గుర్తు చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు’ అని అన్నారు.
ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని, విజిబి ఫిల్మ్స్ బ్యానర్‌పై గిరి బాబు వల్లభనేని నిర్మించిన ఈ చిత్రంలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషీ, జయ సుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్ష వర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కోడూరి, మహేష్ చింతల కీలక పాత్రలలో నటించారు. డిసెంబర్ 4 నుండి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానున్న ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రాన్ని చూసి ఆస్వాదించండి.
https://www.instagram.com/p/DgPfrPIR0pR


